Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల నిరసన

సింహాద్రిపురం, నవంబరు 26: అధికారుల నిర్లక్ష్యంపై అంకాళమ్మ గూడూరు సచివాలయం వద్ద శుక్రవారం గ్రామస్థులు నిరసన చేప ట్టారు. బస్టాండు సమీపంలో చాలా కాలంగా రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీటి సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదన్నారు. రోడ్డుపై మురికి నీరు ప్రవహించడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలిపినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని గ్రామ స్థులు తెలిపారు.

రోజూ వందల సంఖ్యలో వాహనాలు తిరిగే పులి  వెందుల-తాడిపత్రి ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఇలాంటి దుస్థితి నెలకొనడం తో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి వెంకటరాముడును వివరణ కోరగా ఆ రోడ్డు ఆర్‌అం డ్‌బీ పరిధిలోనిదని, ఆర్‌అండ్‌బీ  అధికారులు, ఎంపీడీఓకు సమాచా రం తెలిజేశాము. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము.

Advertisement
Advertisement