ట్రెంచు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-01-19T04:10:04+05:30 IST

పోతనపల్లి శివారులో గొల్లవాగు ప్రాజెక్టు కట్ట కింద ఉన్న సుమారు 20 ఎకరాల భూమి చుట్టూ అటవీ అధికారులు ట్రెంచు పనులు చేపడుతుండగా మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీ సెక్షన్‌ అధికారి రామకృష్ణ సర్కార్‌ మాట్లాడుతూ గొల్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా కట్ట కింద ఉన్న మిగిలిన భూమి అటవీ శాఖదని, దీనిచుట్టూ హద్దురాళ్లను గతంలో ఏర్పాటు చేశా మని తెలిపారు.

ట్రెంచు పనులను అడ్డుకున్న గ్రామస్తులు
పనులను అడ్డుకుంటున్న గ్రామస్తులు

భీమారం, జనవరి 18: పోతనపల్లి శివారులో గొల్లవాగు ప్రాజెక్టు కట్ట కింద ఉన్న సుమారు 20 ఎకరాల భూమి చుట్టూ అటవీ అధికారులు ట్రెంచు పనులు చేపడుతుండగా మంగళవారం గ్రామస్తులు  అడ్డుకున్నారు. అటవీ సెక్షన్‌ అధికారి రామకృష్ణ సర్కార్‌ మాట్లాడుతూ గొల్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా కట్ట కింద ఉన్న మిగిలిన భూమి అటవీ శాఖదని, దీనిచుట్టూ హద్దురాళ్లను గతంలో ఏర్పాటు చేశా మని తెలిపారు. కందకం  పనులు చేయడానికి వీలు లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఇరిగేషన్‌, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో జాయింట్‌ సర్వే నిర్వహిస్తామని, అప్పటి వరకు గ్రామస్తులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రాజెక్టు డీఈఈ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న మ్యాప్‌ రికార్డుల ఆధారంగానే పనులు చేస్తున్నారని, వివాదాస్పదమైన భూమిని త్వరలో జాయింట్‌ సర్వేలు నిర్వహించి పరిష్కరిస్తామని తెలిపారు. ఇరిగేషన్‌ శాఖ ఏఈ శశాంక్‌రెడ్డి, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ రాంసింగ్‌, బీట్‌ అధికారి గోవింద్‌, నాయకులు రవి, నాగరాజు, రాజ్‌కుమార్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T04:10:04+05:30 IST