Abn logo
Oct 28 2021 @ 00:56AM

రోడ్డు విస్తరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు

సర్వే ప్రతినిధులతో మాట్లాడుతున్న గ్రామస్థులుముందస్తు సమాచారం లేకుండా సర్వే తగదని అభ్యంతరం

 అచ్యుతాపురం రూరల్‌: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సర్వేకు విచ్చేసిన ఏపీఆర్‌డీసీ ప్రతినిధులను బుధవారం హరిపాలెం, తిమ్మరాజుపేట గ్రామస్థులు అడ్డుకున్నారు. రోడ్డు పనుల్లో నష్టపోతున్న వారి నుంచి ఆధార్‌, బ్యాంకు అకౌంట్లను సేకరి స్తున్న ఆర్‌టీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను నిలదీశారు. వీఆర్‌వోకు, సర్పంచ్‌కు, రెవెన్యూ అధికారులకు ముందస్తు సమాచారం లేకుండా సర్వే జరపడంపై అభ్యంతరం తెలిపారు. రోడ్డు విస్తరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అధికారులు గ్రామసభ నిర్వహించి, రోడ్డు విస్తరణలో నష్టపోతున్న స్థలాలు, నివాసాలు, షాపుల విలువను ప్రకటించిన తర్వాతే వివరాలను సేకరించాలని వారంతా పట్టుబట్టారు.