ఆ వీడియోతో అలజడి.. కరెన్సీ నోట్లు సబ్బుతో కడుగుతున్న గ్రామస్తులు!

ABN , First Publish Date - 2020-04-08T23:04:35+05:30 IST

కరోనా వైరస్ భయంతో ఓ గ్రామంలోని ప్రజలు కరెన్సీ నోట్లను సబ్బుతో కడుగుతున్న వైనమిది...

ఆ వీడియోతో అలజడి.. కరెన్సీ నోట్లు సబ్బుతో కడుగుతున్న గ్రామస్తులు!

మైసూరు: కరోనా వైరస్ భయంతో ఓ గ్రామంలోని ప్రజలు కరెన్సీ నోట్లను సబ్బుతో కడుగుతున్న వైనమిది. కర్ణాటకలోని మాండ్య సమీపంలో మారనా చకనహళ్లిలో జరుగుతోందీ చిత్రం. సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రూ.2 వేల నోటు నుంచి రూ.10 నోటుదాకా ఏదీ వదలకుండా శుభ్రంగా సబ్బునీళ్లలో కడిగి ఆరబెట్టాకే జేబులో పెట్టుకుంటున్నారు.


వైరస్ వ్యాప్తి చేస్తున్నామంటూ కొందరు కరెన్సీ నోట్లకు ఉమ్మిరాస్తూ, తమ ముఖానికి, ముక్కుకు రాసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో వీటిని వైరల్ చేస్తున్న ఓ వ్యక్తిని గత వారమే అరెస్టు చేశారు. కాగా మాండ్య జిల్లా అధికార యంత్రాంగం సైతం ప్రజలు తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలనీ.. కరెన్సీ నోట్లు ముట్టుకున్నా చేతులు కడుక్కోవాలని సూచించింది. దీంతో ఇకపై కరెన్సీ నోట్లు శుభ్రం చేయకుండా ముట్టుకోరాదని సదరు గ్రామ ప్రజలు నిర్ణయించారు. 

Updated Date - 2020-04-08T23:04:35+05:30 IST