దొరసానిపాడు గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-01-14T05:55:38+05:30 IST

కనుమనాడు దొరసానిపాడు గ్రామంలోగల కనుమ మంటపంనకు చినవెంకన్న ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఊరే గింపుగా తీసుకువెళ్లి కనుమ ఉత్సవం నిర్వహించి గిరి ప్రదక్షణగా స్వామి వారిని ఆలయంలోకి తీసుకురావడం సంప్రదాయంగా జరుగుతోంది. అయితే

దొరసానిపాడు గ్రామస్థుల ఆందోళన


ద్వారకాతిరుమల, జనవరి 13:  కనుమనాడు దొరసానిపాడు గ్రామంలోగల కనుమ మంటపంనకు చినవెంకన్న ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఊరే గింపుగా తీసుకువెళ్లి కనుమ ఉత్సవం నిర్వహించి గిరి ప్రదక్షణగా  స్వామి వారిని ఆలయంలోకి తీసుకురావడం  సంప్రదాయంగా జరుగుతోంది. అయితే కోవిడ్‌ నిబంధనలు వల్ల ఈ నెల 31 వరకు  ఉండటంతో   కనుమ ఉత్సవం  నిలుపుదల చేశారు. దీంతో దొరసానిపాడు గ్రామస్థులు కనుమ ఉత్సవం నిర్వహించాలని ర్యాలీగా దేవస్థానం వద్దకు చేరుకోగా  పోలీసులు వారిని అదుపుచేసి ఈవోకు ఫోన్‌ ద్వారా ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావు విషయం తెలిపారు. దీంతో దేవస్థానం చైర్మన్‌ సుధాకర్‌రావు  కోవిడ్‌  నిబంధనల వల్ల కనుమ ఉత్సవం నిలిపామని,  ప్రభుత్వం నుంచి సడలింపు ఆదేశాలు వచ్చిన అనంతరం ఉత్సవం ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో దొరసానిపాడు గ్రామస్థులు ఆందోళన విరమించారు. 


Updated Date - 2021-01-14T05:55:38+05:30 IST