Abn logo
May 9 2021 @ 15:06PM

గుంటూరు జిల్లాలో ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

గుంటూరు: జిల్లాలోని కొల్లిపరలో ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. హనుమాన్‌పాలెం గ్రామంలోకి నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని.. ఈ లారీలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు అన్నారు. 11 క్వారీల నుంచి లారీలు ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. లారీల రవాణాతో రోడ్లు అస్థవ్యస్తంగా మారాయన్నారు. లారీల వల్ల ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు. గ్రామస్తులు నిరసనగా వెళ్లి లారీలను అడ్డుకున్నారు. దాంతో లారీలు భారీగా నిలిచిపోయాయి. ఇసుక లారీలను గ్రామంలోకి రాకుండా చూడాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.