Abn logo
Nov 25 2021 @ 16:58PM

మంత్రులపై గ్రామస్తుల ఆగ్రహం

నెల్లూరు: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వ్యతిరేకత ఉన్న గ్రామాల్లోకి వెళ్లకుండా మంత్రులు వెనుదిరుగుతున్నారు. వరద ప్రభావిత గ్రామమైన బండారుపల్లిలో దెబ్బతిన్న బ్రిడ్జ్‌ను పరిశీలించి గ్రామంలోకి వెళ్లకుండా వెనుతిరగడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతసాగరం మండలం రేవూరులో వరద కారణంగా సర్వం కోల్పోయిన గిరిజన బాధితులు మంత్రుల కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు.