కరోనా కట్టడిలో ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-03-31T10:47:49+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో గ్రామ, గ్రామాన తిరుగుతూ ప్రజలకు సూచనలు

కరోనా కట్టడిలో ఎమ్మెల్యేలు

గ్రామాల వారీగా ప్రచారాలు

 పారిశుధ్యం పనులు చేస్తూ అవగాహన

రేషన్‌ పంపిణీ దుకాణాల పరిశీలన


భీమవరం టౌన్‌/తణుకు/ఉండి/బుట్టాయగూడెం/ పాలకొల్లు అర్బన్‌/ పాల కోడేరు/ నరసాపురం, మార్చి 30 : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో గ్రామ, గ్రామాన తిరుగుతూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవ్వాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దుకాణాల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించకుంటే దుకాణాలు సీజ్‌ చేస్తామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హెచ్చరించారు.


మోటార్‌ సైకిల్‌పై ఆయన భీమవరంలో పర్యటించి షాపులను తనిఖీచేసి పలు సూచనలు అం దించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించాలన్నారు. ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, ఆశా వర్కర్లకు, మీడియాకు శానిటైజర్‌, మాస్కులు అందించామన్నారు.  కరోనా మహ మ్మారిని అరికట్టడానికి ప్రబుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు నానా అగచాట్టు పడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమస్యలను తెలియజేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలే స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.


సోమవారం ఉండిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్లీచింగ్‌, స్ర్పే, ముగ్గు చల్లడం చేశారు. బుట్టాయగూడెం మండలం ఏరుమద్దిగూడెం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించి కరోనా వైరస్‌పై ప్రజలకు అవ గాహన కల్పించారు. గ్రామస్థులందరికీ మాస్క్‌లు పంపిణీ చేశారు. గిరిపుత్రులకు అవగాహన కల్పిస్తూ కరోనా ప్రభావాన్ని తీసుకుంటున్న జాగ్రత్తలను తెలియజేశా రు. రేషన్‌ సరుకులు తీసుకునేటప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ప్రసాదరాజు అన్నారు. సోమవారం నరసాపురం పట్టణంలోని 16వ వార్డులో ఉచిత రేషన్‌ పంపిణీని ఆయన పరిశీలించారు.

Updated Date - 2020-03-31T10:47:49+05:30 IST