విచిత్ర ఆచారం: అక్కడ వధువును అత్తారింటికి ఎలా సాగనంపుతారంటే...

ABN , First Publish Date - 2022-06-25T16:43:52+05:30 IST

మన దేశంలో పెళ్లిళ్లను పండుగలా జరుపుకుంటారు.

విచిత్ర ఆచారం: అక్కడ వధువును అత్తారింటికి ఎలా సాగనంపుతారంటే...

మన దేశంలో పెళ్లిళ్లను పండుగలా జరుపుకుంటారు. పెళ్లి సందర్భంలో చాలా ప్రాంతాల్లో వధువు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తుంది. అయితే వితంతువు వేషధారణలో వధువుకు వీడ్కోలు పలికే గ్రామం మన దేశంలో ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎరుపురంగు పెళ్లి దుస్తులకు బదులు తెల్లటి దుస్తులలో అత్తారింటికి సాగనంపుతారు. ఈ విచిత్రమైన సంప్రదాయం పాటించే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఉంది. 


భామ్‌డోంగ్రి గ్రామంలో గిరిజన సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూతురి పెళ్లయ్యాక తల్లిదండ్రులు ఆమెకు వితంతువు దుస్తులు ధరింపజేసి అత్తారింటికి పంపిస్తారు. అంతేకాదు పెళ్లికి హాజరయ్యే వారంతా కూడా తెల్లని దుస్తుల్లోనే కనిపిస్తారు. ఇక్కడి ప్రజలు గోండి ఆచారాన్ని అనుసరిస్తారు. వారి నమ్మకం ప్రకారం తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. ఈ రంగును వారు పవిత్రంగా భావిస్తారు.  వివాహం సందర్భంగా తెల్లని వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. పెళ్లికి హాజరయ్యే వారందరూ తెల్లని దుస్తులు ధరిస్తారు. సాధారణంగా పెళ్లి సమయంలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. కానీ వీరి ఆచారంలో నాలుగు ప్రదక్షిణలు వధువు ఇంటి వద్ద, మిగిలిన మూడు ప్రదక్షిణలు వరుడి ఇంట్లో చేస్తారు. గ్రామంలో మద్యం నిషేధం అమలులో ఉంది. 

Updated Date - 2022-06-25T16:43:52+05:30 IST