మైనర్ బాలికపై అత్యాచారం.. గ్రామపెద్దలు పంచాయితీ నిర్వహించి ఇచ్చిన విచిత్ర తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-17T09:21:31+05:30 IST

బీహార్‌లోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది.. అదే గ్రామానికి చెందిన వృద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు.. నిందితుడు తన నేరం అంగీకరించాడు.. దీంతో ఆ బాలిక కుటుంబానికి నష్ట పరిహారంగా రూ.2 లక్షలు చెల్లిస్తే...

మైనర్ బాలికపై అత్యాచారం.. గ్రామపెద్దలు పంచాయితీ నిర్వహించి ఇచ్చిన విచిత్ర తీర్పు ఏంటంటే..

బీహార్‌లోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది.. అదే గ్రామానికి చెందిన వృద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు.. నిందితుడు తన నేరం అంగీకరించాడు.. దీంతో ఆ బాలిక కుటుంబానికి నష్ట పరిహారంగా రూ.2 లక్షలు చెల్లిస్తే చాలని పంచాయితీ పెద్దలు తీర్పునిచ్చారు.. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పంచాయితీ పెద్దలపై చర్యలకు ఆదేశించారు. 


బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఓ మైనర్ బాలిక వంట పని చేసేది. ఆ క్రమంలో ఆ బాలికపై వృద్ధుడు పలుసార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికకు అబార్షన్ చేయించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు గ్రామంలోనే పంచాయితీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి నిందితుడు రూ.2 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. 


బలవంతంగా బాధిత కుటుంబం చేత పోలీస్ స్టేషన్ నుంచి కేసు వాపసు తీసుకునేలా చేశారు. ఈ విషయం పోలీసు సూపరింటెండెంట్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అలాగే తీర్పునిచ్చిన పంచాయితీ పెద్దలపై చర్యలకు ఆదేశించారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2022-04-17T09:21:31+05:30 IST