బాధితురాలిపై పంచాయితీ పెద్దల క్రౌర్యం.. ఆమెపై జరిగిన ఘోరానికి వారు ఎంత వెల కట్టారంటే..

ABN , First Publish Date - 2022-05-11T09:05:39+05:30 IST

ఆమె ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తోంది. ఆ విషయం తెలుసుకున్న యువకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చారు.. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం పంచాయితీకి చేరింది.. వారు నిందితుడికి కేవలం రూ.51 వేలు నష్టపరిహారం..

బాధితురాలిపై పంచాయితీ పెద్దల క్రౌర్యం.. ఆమెపై జరిగిన ఘోరానికి వారు ఎంత వెల కట్టారంటే..

ఆమె ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తోంది.  ఆ విషయం తెలుసుకున్న యువకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు.  ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చారు.. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  విషయం పంచాయితీకి చేరింది. వారు నిందితుడికి కేవలం రూ.51 వేలు నష్టపరిహారం విధించి.. బాధితురాలకి ఇదే సరైన న్యాయం అని పంచాయితీ పెద్దలు చెప్పారు. 


బీహార్‌లోని మాధేపురాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది. గత నెల 30న ఆ యువతి తన ఇంట్లో నిద్రిస్తూ ఉండగా స్థానిక యువకుడు యువకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను రక్షించారు. ఆ ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పంచాయితీ పెద్దలు రంగంలోకి దిగారు. వారే పంచాయితీ నిర్వహించి తీర్పునిచ్చారు. 


బాధితురాలికి నిందితుడు రూ.51 వేల నష్టపరిహారం చెల్లిస్తు చాలని తీర్పు చెప్పారు. ఇక, ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనని బాధితురాలి చేత లేఖ రాయించి సంతకం కూడా పెట్టించుకున్నారు. ఈ ఘటనపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Read more