ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి.. పంచాయతీలో విచిత్రమైన శిక్ష వేసిన పెద్దలు

ABN , First Publish Date - 2022-04-25T07:50:10+05:30 IST

మహిళలను ఎవరు వేధించినా సరే శిక్షలు కఠినంగా ఉంటాయి. తాజాగా బిహార్‌లో జరిగిన ఘటన ఆ కోవకే చెందుతుంది. ఒక మహిళపై అత్యాచారం యత్నం చేయబోయిన యువకుడిని ఆ గ్రామ పెద్దలు చిత్రమైన శిక్ష విధించారు..

ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి.. పంచాయతీలో విచిత్రమైన శిక్ష వేసిన పెద్దలు

మహిళలను ఎవరు వేధించినా సరే శిక్షలు కఠినంగా ఉంటాయి. తాజాగా బిహార్‌లో జరిగిన ఘటన ఆ కోవకే చెందుతుంది. ఒక మహిళపై అత్యాచారం యత్నం చేయబోయిన యువకుడిని ఆ గ్రామ పెద్దలు చిత్రమైన శిక్ష విధించారు. ఆ మహిళను కొంత డబ్బు నష్ట పరిహారం చెల్లించాలని.. గోడ కుర్చీ వేసి, ఊసిన ఉమ్మిని మళ్లీ మింగాలని నిందితుడిని శిక్షించారు.


వివరాల్లోకి వెళితే.. బడహియా ప్రాంతానికి చెందిన ఒక  వ్యక్తి(47).. బలవంతంగా ఒక ఇంట్లో ప్రవేశించాడు. అక్కడ నివశించే మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె పెద్దగా అరిచి గోల చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయే తొందరలో తన లుంగీ, టార్చిలైటును ఆ ఇంట్లోనే వదిలేశాడు. అనంతరం తనకు జరిగిన ఘటనను బాధితురాలు అందరికీ చెప్పింది. దీంతో ఉదయమే పంచాయతీ పెద్దలంతా చేరి ఈ నేరంపై విచారణ చేపట్టారు. 


నిందితుడిని పట్టుకొచ్చి కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాధితురాలికి రూ.25051 నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానించారు. దీంతోపాటు నిందితుడు చెవులు పట్టుకొని ఐదు గుంజీలు తీయాలని, ఉమ్మి నాకాలని శిక్ష విధించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.ఈ శిక్షను రిజిస్టర్ కూడా చేయడం గమనార్హం.

Updated Date - 2022-04-25T07:50:10+05:30 IST