ఏపీలో పోలీసులుగా గ్రామ, వార్డు సంరక్షణ మహిళా కార్యదర్శులు

ABN , First Publish Date - 2022-01-13T01:13:22+05:30 IST

ఏపీలో పోలీసులుగా గ్రామ, వార్డు సంరక్షణ మహిళా కార్యదర్శులను

ఏపీలో పోలీసులుగా గ్రామ, వార్డు సంరక్షణ మహిళా కార్యదర్శులు

అమరావతి: ఏపీలో పోలీసులుగా గ్రామ, వార్డు సంరక్షణ మహిళా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పోలీసులకు పోలీస్‌శాఖలో ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు చేయనున్నారు. పనితీరు ఆధారంగా మహిళా పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు. మహిళా పోలీస్, సీనియర్(మహిళా పోలీస్), ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్‌(నాన్ గెజిటెడ్)గా పదోన్నతులు కల్పిస్తారు. మహిళా పోలీసుల నియామకాల్లో  90 శాతం  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తారు. దీనిలో 5 శాతం హోమ్‌గార్డులు, 5 శాతం గ్రామ/వార్డు వాలంటీర్ల నుంచి ఎంపిక చేస్తారు. మహిళా పోలీసుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో శరీర దారుఢ్యం కొలతలను ప్రకటించారు. 20 నిమిషాల్లో 2 కి.మీ. పరుగు పోటీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

Updated Date - 2022-01-13T01:13:22+05:30 IST