ముళ్ల కంపతో గ్రామ రోడ్డు మూసివేత

ABN , First Publish Date - 2021-05-17T04:43:24+05:30 IST

కరోనా వణికిస్తున్న నేపథ్యంలో హైవే నుంచి గోనుపల్లి గ్రామానికి వచ్చే బ్రాంచి రోడ్డును ప్రజలు ముళ్లకంపలు వేసి, తాళ్లు కట్టి మూసివేశారు.

ముళ్ల కంపతో గ్రామ రోడ్డు మూసివేత
గోనుపల్లి గ్రామంలోకి వాహనాలు రాకుండా రోడ్డును మూసేసిన గ్రామస్థులు

రాపూరు, మే 16: కరోనా వణికిస్తున్న నేపథ్యంలో హైవే నుంచి గోనుపల్లి గ్రామానికి వచ్చే బ్రాంచి రోడ్డును ప్రజలు ముళ్లకంపలు వేసి, తాళ్లు కట్టి మూసివేశారు. పెంచలకోన క్షేత్రానికి సమీపంలో ఉండడం, మద్యం దుకాణం ఉండడంతో ఈ గ్రామాన్ని కరోనా  వణికిస్తోంది. గ్రామంలో పెద్ద సంఖ్యలో జ్వరపీడితులు ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువేనంటున్నారు. గ్రామంలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. అందులో కోన ఉద్యోగులు ముగ్గురు ఉన్నారు. దీంతో గ్రామంలో పాలకులు శానిటేషన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ గ్రామానికి కొత్తవారు ఎవరూ రావద్దంటూ దారిని  మూసివేశారు. 

Updated Date - 2021-05-17T04:43:24+05:30 IST