భారత నౌకాదళంలోకి విక్రాంత్‌

ABN , First Publish Date - 2022-07-29T08:14:57+05:30 IST

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో బ్రహ్మాస్త్రం చేరింది.

భారత నౌకాదళంలోకి విక్రాంత్‌

రూ.20 వేల కోట్లతో దేశీయంగా రూపొందించిన విమాన వాహక నౌక

నౌకాదళానికి అందజేసిన కొచ్చి షిప్‌యార్డ్‌.. వచ్చే నెలలో జలప్రవేశం


న్యూఢిల్లీ, జూలై 28: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో బ్రహ్మాస్త్రం చేరింది. స్వదేశీయంగా రూపొందించిన విమాన వాహక నౌక(ఐఏసీ) ‘విక్రాంత్‌’ను దాని తయారీదారు కొచ్చి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ గురువారం నేవీకి అప్పగించింది. వచ్చే నెలలో ఈ యుద్ధ నౌక జలప్రవేశం చేయనుంది. రూ.20 వేల కోట్లతో నిర్మించిన ఈ యుద్ధనౌక మిగ్‌-29కే ఫైటర్‌ జెట్‌లతోపాటు కమోవ్‌-31 హెలికాప్టర్లు, ఎంహెచ్‌-60ఆర్‌ మల్టీరోల్‌ హెలికాప్టర్లను ఆపరేట్‌ చేయగలదు. దీనిలో 1,700 మంది సిబ్బంది కోసం 2,300 కంపార్ట్‌మెంట్లు నిర్మించారు. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ నౌక గరిష్ఠ వేగం 28 నాట్లు. క్రూజింగ్‌ వేగం 18 నాట్లు. దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు.. ఎత్తు 59 మీటర్లు. దీన్ని ఆగస్టు 15న ప్రారంభించే అవకాశం ఉంది.

Updated Date - 2022-07-29T08:14:57+05:30 IST