Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 20:58:59 IST

విక్రమ్ Cobra థియేటర్స్‌కీ వచ్చేది ఆ రోజే

twitter-iconwatsapp-iconfb-icon

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఈ ఏడాది ‘మహాన్’ (Mahaan) సినిమాతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రానికీ ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. 


‘కోబ్రా’ కు అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu ) దర్శకత్వం వహించాడు. ఏఆర్. రెహమాన్(AR Rahman) సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో విక్రమ్ లుక్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో ఈ సినిమాను మే 26న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ ఖాన్, రోషన్ అండ్రూస్, మృణాళిని రవి, కేఎస్. రవికుమార్, పద్మ ప్రియ, మియా జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 7స్ర్ర్కీన్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించడంతో పాటు దాదాపుగా 20రకాల విభిన్న గెటప్పులతో సందడిచేయనున్నట్టు సమాచారం. ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మార్చి 2020లో రష్యాలో చిత్రీకరించాలనుకున్నారు. 15రోజుల షెడ్యూల్ కోసం ఆ దేశానికి వెళ్లారు. ఆ సమయంలోనే కరోనా వచ్చింది. దీంతో చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుని అనివార్యంగా ఇండియాకు వచ్చింది. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International