Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 28 Jun 2022 10:21:19 IST

Cobra మూవీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ!

twitter-iconwatsapp-iconfb-icon

'చియాన్' విక్రమ్ (Vikram) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కోబ్రా' (Cobra). ఇందులో విక్రమ్ విభిన్న గెటప్పుల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. దీనిలో విక్రమ్‌ లుక్‌, నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Cobra మూవీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ!

ఇక ఈ సినిమాలో విక్రమ్‌ గొప్ప గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), మృణాళిని రవి (Mirnalini Ravi), కె.ఎస్‌. రవికుమార్‌ (K. S. Ravikumar) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) ముఖ్య పాత్రలో కనువిందు చేయనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మించిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ. ఆర్‌. రెహమాన్‌ (A R Rehaman) సంగీతం అందించారు. వాస్తవంగా ఈ సినిమాను మే 26న విడుదల చేయనున్న్నట్టు మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ, పలుకారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 

Cobra మూవీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ!

ఇప్పటికే, 'కోబ్రా' చిత్రానికికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ చిత్రం తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను నటుడు ఉదయనిధి స్టాలిన్ దక్కించుకున్నారు. స్టాలిన్ తన హోమ్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే, ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి త్వరలో రాబోతున్న విక్రమ్ 'కోబ్రా' ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement