విక్రమ్‌... వెల్‌కమ్‌ టు అన్బు-అరివు

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కగనరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘విక్రమ్‌’. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించే బాధ్యతను స్టంట్‌ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివు ద్వయానికి

విక్రమ్‌... వెల్‌కమ్‌ టు అన్బు-అరివు

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కగనరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘విక్రమ్‌’. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించే బాధ్యతను స్టంట్‌ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివు ద్వయానికి అప్పగించారు. చిత్రానికి వాళ్లిద్దరూ పని చేస్తున్నట్టు శనివారం దర్శకుడు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.


కమల్‌, ఇద్దరు మాస్టర్లతో దిగిన ఫొటోకు ‘వెల్‌కమ్‌ ఆన్‌బోర్డ్‌ మాస్టర్స్‌’ అని పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌ కథతో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌లో కత్తులు, గన్నులతో కమల్‌ కనిపించారు. మరి, యాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో! ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ చేస్తున్న చిత్రమిది. కమల్‌ హాసన్‌తో అతనికి తొలి చిత్రం కూడా ఇదే. దీనిని రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST