Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 14 May 2022 10:55:10 IST

Vikram: ఆడియో ఫంక్షన్‌కు అతిథులుగా కోలీవుడ్ బిగ్ స్టార్స్..?

twitter-iconwatsapp-iconfb-icon

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ (Vikram). ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ 3న ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. కమల్ నుంచి సినిమా వచ్చి చాలా లాంగ్ గ్యాప్ రావడంతో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  విశ్వరూపం 2 (Vishwaroopam 2) తర్వాత కమల్ నుంచి రాబోతున్న విక్రమ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. 

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లుకొడుతోంది. ఈ మే 15వ తేదీన విక్రమ్ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే, అదే రోజు సాయంత్రం ఘనంగా ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవలే 'సేవ్ ది డేట్' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. అయితే, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆడియో ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth), సూర్య (Surya), విజయ్ (Vijay) గెస్టులుగా రాబోతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తూ వైరల్ అవుతోంది.

Vikram: ఆడియో ఫంక్షన్‌కు అతిథులుగా కోలీవుడ్ బిగ్ స్టార్స్..?

ఇది నిజమై ఒకే వేదికపైన కమల్‌తో పాటు రజనీకాంత్, సూర్య, విజయ్ కనిపిస్తే చూసేందుకు రెండు కళ్ళూ చాలవని ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. మరీ మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇవ్వనున్నారో చూడాలి. కాగా, ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో కమల్‌తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathy), ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International