Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 07 Dec 2021 16:59:17 IST

‘విక్రమ్ గౌడ్’ టీజర్: 2 తెలుగు రాష్ట్రాలను మళ్లీ ఒక్కటి చేస్తేనే.. అంటోన్న పోసాని

twitter-iconwatsapp-iconfb-icon

‘‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటై.. రెండున్నర సంవత్సరాలు తెలంగాణ వారు, రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వారు పరిపాలిస్తే.. ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి..’’ అని పోసాని అంటున్నారు. అయితే ఇదే రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని పాశం నరసింహారావు దర్శకత్వంలో సుహాసిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్ డిఎస్‌కె స్క్రీన్ స్టూడియోస్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్.. ప్రముఖ నిర్మాత, నటుడు డి.ఎస్. రావ్ విడుదల చేశారు. 


ఈ టీజర్‌లో.. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం..’ అనే పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. నేటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంటే.. ‘మళ్లీ తెలుగు రాష్ట్రం అంతా ఒకటే కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని’ చెప్పడం సరికొత్త ఆలోచనలని రేకెత్తిస్తోంది. డేటింగ్‌కి ఒకరు, చాటింగ్‌కి మరొకరు, నిశ్చితార్థానికి ఇంకొకరు.. అని హీరో కిరణ్ రాజ్ చెప్పే డైలాగ్ నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తుంది. హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ.. హీరో చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ‘‘ముఖేష్ అంబానీ వజ్రపు బియ్యం, రామోజీరావు బంగారు బియ్యం తిన్నా.. తినేది మాత్రం గుప్పెడు బియ్యమే కదా..’’ అనే డైలాగ్, ‘‘26 అక్షరాలతో తయారైన పరాయి భాషలోనే అన్ని బూతులు తిడితే.. 56 అక్షరాలతో తయారైన రాజభాష‌.. నా మాతృభాషలో తిడితే.. నెత్తిన పెట్టుకున్న ఆ పరాయిభాష దేనికి పనికికాదు’’ అని హీరో విరోచితంగా చెప్పే డైలాగ్స్ ఈ టీజర్‌కే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా పవర్ ఫుల్ డైలాగ్స్‌, యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.

ఈ టీజర్ విడుదల అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. కొత్తవాళ్లు ఈ సినిమా చేసినట్లు అనిపించలేదు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. హీరో చాలా బాగున్నాడు. మంచి భవిష్యత్ ఉంటుంది. విక్రమ్ అనే టైటిల్‌లోనే విజయం ఉంది. యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఈ చిత్రానికి ఎటువంటి సహకారం అయినా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు’’ అని తెలుపగా.. డి.ఎస్. రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతానిగారితో కలిసి ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్‌ చూస్తుంటే.. పొలిటికల్ టచ్‌తో మంచి ఎమోషన్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది. ‘మంత్ర’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ చాలా బాగుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి ప్రేక్షకాదరణ పొంది చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ‘మంత్ర’ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ‘విక్రమ్ గౌడ్’ టీజర్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్, డి.ఎస్. రావ్ గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా చాలా బాగుంటుంది. పొలిటికల్, ఎమోషనల్‌గా అనిపించినా.. మంచి లవ్ స్టోరి ఇందులో ఉంది. ఈ సినిమాని అందరూ ఆదరించి, దర్శకులు నరసింహారావుగారిని, మా టీమ్‌ మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని తెలుపగా.. దర్శకుడు పాశం నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన పెద్దలు ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి, డిఎస్ రావ్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘విక్రమ్ గౌడ్’ సినిమాలో మీరు ఊహించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా లవ్, సెకండాఫ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడుస్తుంది. చివరి 25 నిమిషాలు అయితే ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు చేరి ఎగ్జయిట్ అవుతారు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. హీరో కిరణ్ రాజ్ చాలా కసిగా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ఎడిటర్ జానకి రామ్ గారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలబడి సహకరించారు. ఆనంద్‌గారు మంచి పాటలు ఇచ్చారు. మేము అడిగిన ప్రతీది సమకూర్చి.. నిర్మాత ఎంతో సహకారాన్ని అందించారు. 2022 ఫస్ట్ క్వార్టర్‌‌లో ఈ సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని అన్నారు. 

విక్రమ్ గౌడ్ టీజర్: 2 తెలుగు రాష్ట్రాలను మళ్లీ ఒక్కటి చేస్తేనే.. అంటోన్న పోసాని


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement