ఎయిర్ ఇండియా సీఎండీగా విక్రమ్ దేవ్‌దత్

ABN , First Publish Date - 2022-01-19T01:49:35+05:30 IST

టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్..

ఎయిర్ ఇండియా సీఎండీగా విక్రమ్ దేవ్‌దత్

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ వచ్చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్‌దత్‌ను ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో ఉన్నతస్థాయి బ్యూరోక్రటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నియామకం జరిగింది.


1993 కేడర్ అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) ఐఏఎస్ అధికారి అయిన దత్‌ను అడిషనల్ సెక్రటరీ హోదా, వేతనంతో ఎయిరిండియా చీఫ్‌గా నియమిస్తూ పర్సనల్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చంచల్‌కుమార్‌ను జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. చంచల్ కుమార్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం బీహార్‌లో పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-01-19T01:49:35+05:30 IST