యూఎస్ సెనేటర్ ట్వీట్‌కు.. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఘాటు రిప్లై !

ABN , First Publish Date - 2020-10-12T16:49:04+05:30 IST

అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అభ్యర్థి లారెన్ విట్జ్కే చేసిన 'థర్డ్ వరల్డ్ మిగ్రెంట్స్' ట్వీట్‌కు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఘాటు రిప్లైతో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్నారు.

యూఎస్ సెనేటర్ ట్వీట్‌కు.. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఘాటు రిప్లై !

అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అభ్యర్థి లారెన్ విట్జ్కే చేసిన 'థర్డ్ వరల్డ్ మిగ్రెంట్స్' ట్వీట్‌కు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఘాటు రిప్లైతో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే... సెనేటర్ లారెన్ విట్జ్కే... "మోస్ట్ థర్డ్ వరల్డ్ మిగ్రెంట్స్ పౌర సమాజంలో అంతా త్వరగా కలవలేరు. నా వాదనను తప్పు అని నిరూపించండి" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ అమెరికాకు వలస వెళ్లిన చాలా మందిని విస్మయానికి గురిచేసింది. దీనిపై చాలా మంది తమదైన శైలిలో సమాధానం చెప్పారు. తాము సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రిట్వీట్స్ చేశారు.


ఇలా స్పందించిన వారిలో ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా కూడా ఉన్నారు. ఆయన కూడా గడిచిన కొన్నేళ్లలో తాను సాధించిన అపూర్వ విజయాలు.. వాటికి దక్కిన పురస్కారాలు.. ప్రశంసలను ఈ సందర్భంగా వికాస్ తన రిప్లైలో ప్రస్తావించారు. "ఎలియనోర్ రూజ్‌వెల్ట్ అవార్డు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అవార్డు నుండి గేమ్ ఛేంజర్స్ వరకు... మిచెలిన్ స్టార్, జేమ్స్ బార్డ్ నోమ్ నుండి ఆస్కార్ అర్హత 2020 వరకు... 'ది హాటెస్ట్ చెఫ్ ఇన్ న్యూయార్క్' నుండి న్యూయార్క్ టైమ్స్ ముఖచిత్రం వరకు... ముగ్గురు ప్రెసిడెంట్ల కోసం వంటకు సంబంధించి అనేక ప్రచురణలు”అని రీట్వీట్ చేశారు. అంతే... వికాస్ రీట్వీట్‌ క్షణాల వ్యవధిలోని వైరల్‌గా మారింది. లారెన్‌కు సరియైన సమాధానం చెప్పారంటూ చాలా మంది నెటిజన్లు వికాస్‌ను ప్రశంసించారు. ఆయన ట్వీట్‌కు ఏకంగా 14వేల లైక్స్ రావడం విశేషం.  



Updated Date - 2020-10-12T16:49:04+05:30 IST