వికారాబాద్‌లో ఆటో బోల్తా

ABN , First Publish Date - 2021-12-14T17:47:16+05:30 IST

జిల్లాలోని దోమ మండలం బాసుపల్లి సమీపంలో మంగళవారం ఓ ఆటో బోల్తా పడింది.

వికారాబాద్‌లో ఆటో బోల్తా

వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బాసుపల్లి సమీపంలో మంగళవారం ఓ ఆటో బోల్తా పడింది. కుక్కను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో  ఆటోలో ఉన్న ఆరుగురిలో నలుగురికి గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-14T17:47:16+05:30 IST