Vikarabad: ప్రయాణిస్తున్న కారులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన కారు

ABN , First Publish Date - 2021-09-12T16:00:29+05:30 IST

ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటన కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది

Vikarabad: ప్రయాణిస్తున్న కారులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన కారు

వికారాబాద్: ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటన కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి గుల్బార్గా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణికులు అందరు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం ఫైర్ ఇంజన్‎కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2021-09-12T16:00:29+05:30 IST