Cm kcr: మోదీనే ప్రధాన శత్రువు

ABN , First Publish Date - 2022-08-16T23:20:41+05:30 IST

ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యారని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. వికారాబాద్...

Cm kcr: మోదీనే ప్రధాన శత్రువు

వికారాబాద్: ప్రధాని మోదీనే ప్రధాన శత్రువు అని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలో పర్యటించిన ఆయన కేంద్రం అసమర్థత కారణంగానే తెలంగాణ (Telangana)కు నీరు అందడం లేదని వ్యాఖ్యానించారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలలోని పొలాలకు కృష్ణా నీరు (Krishna Water) అందేలా చూసే బాధ్యత తనదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. దుర్మార్గమైన పాలకులను పారద్రోలి తెలంగాణను కాపాడానన్నారు.  రాజకీయంగా చైతన్యం లేని సమాజం దోపిడీకి గురవుతుందని చెప్పారు.  మోసపోతే.. గోసపడతామని.. గత ప్రభుత్వాల హయాంలో అవస్థలు పడ్డామన్నారు. మళ్లీ ఆ బాధలు తెలంగాణలో రావద్దంటే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ సంక్షేమం కోసం.. దేశ ప్రధానినే ప్రశ్నించానని కేసీఆర్ తెలిపారు. 


‘‘నిత్యావసరాలు, ఇంధన వనరుల ధరల పెంపుతో ప్రజలపై భారం మోపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ముందుకు వస్తున్నారు.  ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉందా?. బీజేపీ (Bjp) సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిని ఒకసారి పరిశీలించండి. ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ (Pm Modi) చేసిందేమిటి?. మన సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో కేంద్రం అవమానిస్తోంది.’’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-08-16T23:20:41+05:30 IST