ఆక్రమణల అడ్డా!

ABN , First Publish Date - 2022-05-24T07:08:31+05:30 IST

నిడదవోలు, మే 23: సాధారణంగా రోడ్డు పక్కన చిరువ్యాపారులు, వృత్తిపనివారలు చిన్నచిన్న షెల్టర్లు ఏర్పాటుచేసుకుని జీవనోపాధి పొందుతుంటారు. అవి ప్రభుత్వ స్థలాలైనప్పటికీ ఇలాంటి వాటిపట్ల అధికారులు సైతం కాస్త చూసీచూడనట్టు వదిలేయడ మూ సహజమే. కానీ ఈ ముసుగులో విలు

ఆక్రమణల అడ్డా!
విజ్జేశ్వరం మలుపులోప్రభుత్వ స్థలం అక్రమించి మరీ నిర్మించిన ఓ హోటల్‌

విజ్జేశ్వరం మలుపులో ప్రభుత్వ  స్థలం 

అక్రమించి మరీ నిర్మించిన ఓ హోటల్‌

వైసీసీ నాయకుడి అండతో ఆక్రమణల దందా 

ఖరీదైన జలవనరుల శాఖ స్థలాల అక్రమణ 

ఏమీ చేయలేని స్థితిలో ఇరిగేషన్‌ అధికారులు

నిడదవోలు, మే 23: సాధారణంగా రోడ్డు పక్కన చిరువ్యాపారులు, వృత్తిపనివారలు చిన్నచిన్న షెల్టర్లు ఏర్పాటుచేసుకుని జీవనోపాధి పొందుతుంటారు. అవి ప్రభుత్వ స్థలాలైనప్పటికీ ఇలాంటి వాటిపట్ల అధికారులు సైతం కాస్త చూసీచూడనట్టు వదిలేయడ మూ సహజమే. కానీ ఈ ముసుగులో విలువైన భూములను తమ స్వాధీనంలోకి తెచ్చుకుని రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాల కోసం శాశ్వత నిర్మాణాలను చేస్తే కచ్చితంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కబ్జారాయుళ్లకు అడ్డుకట్ట వేయడానికి నిరంతర పర్యవేక్షణ కూడా ఉండాలి. కానీ ఈ రహదారిలో అలాంటివి ఏమీ ఉండవు. జలవనరుల శాఖకు చెందిన ఈ భూముల్లో రెస్టారెంట్లు, షట్టర్లతో కూడిన షాపులు నిర్మించేస్తున్నా అటువైపు ఎవరూ చూడరు. కారణం.. ఓ వైసీపీ నాయకుడి కనుసన్నల్లో ఆయా నిర్మాణాలు సాగుతుండడమే. నిడదవోలు మండలం విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ వద్ద నుంచి గోపవరంలోని కానూరు కాలువ వరకు జలవనరుల శాఖకు చెందిన విలువైన భూమి ఉంది. గతంలో ఈ భూములు అరకొరగా ఆక్రమణ లకు గురికాగా గత మూడేళ్ల నుంచి ఈ ప్రాంతం ఆక్రమణలకు అడ్డాగా మారింది. స్థానిక వైసీపీ నాయకుడొకరు తన అనుచరుల కోసం ఈ భూమిని ధారాదత్తం చేస్తు న్నాడు. దాంతో పక్కాగా రెస్టారెంట్లు, వివిధ రకాల వ్యాపారాలకు సంబంధించిన నిర్మా ణాలు పెరిగిపోయాయి. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన జలవనరులశాఖ అధికారిని సైతం ఆ నేత హెచ్చరించడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అనుమతులకు విరుద్ధంగా, ఆక్రమించిన స్థలంలో ఏర్పాటుచేస్తున్న రెస్టారెంట్లకు విద్యుత్‌శాఖాధికారులు సైతం విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. రాజమహేంద్రవరం- నిడదవోలు రహదారి కావడంతో ఇటువైపు ట్రాఫిక్‌ ఎక్కువ ఉంటుంది. ఆయా వ్యాపారాల జోరుకు కూడా అదే కారణం. ఇలా ఆక్రమణల్లో భారీఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులకు కనిపించడం లేదంటే ఆశ్చర్యమే. దీనిపై జలవనరుల శాఖ ఏఈఈ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా జలవనరులశాఖకు చెందిన స్థలాలు ఆక్రమణలకు గురైనమాట వాస్తవమేనని, సిబ్బంది తక్కువ ఉండడం రాత్రికిరాత్రే రెస్టారెంట్లు వెలుస్తుండడం, రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేకపోతున్నామని, తాజాగా స్థలాలు ఆక్రమించి రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన వారికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. విద్యుత్‌శాఖ ఏఈ బీవీ రామమూర్తిని వివరణ కోరగా ఆక్రమణల స్థలాల్లో ఏర్పాటుచేసిన రెస్టారెంట్లకు, షాపులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఈ ఆక్రమణదారులకు కేటగిరి 2లో వీరికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి డిపాజిట్‌ ఎనిమిది వందలు అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి మూడు వేల రెండు వందల రూపాయలు డిపాజిట్‌గా వసూలు చేశామని, ఏ క్షణం ప్రభుత్వం ఆక్రమణలు తొలగించినా తమ విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించేందుకు బకాయిలు లేకుండా ఉండేందుకే డిపాజిట్లు అదనంగా వసూలు చేశామని తెలిపారు.

Updated Date - 2022-05-24T07:08:31+05:30 IST