Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 11:44:54 IST

Vijay Sethupathi : ‘మామనిదన్‌’ విడుదల తేదీ మళ్ళీ మార్పు

twitter-iconwatsapp-iconfb-icon

కొంతకాలంగా తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. అందుకే తదుపరి చిత్రాల కథల విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు నటిస్తున్న తాజా చిత్రం ‘మామనిదన్’ (Maamanithan) (మహామనిషి). నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా కారణంగా పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.  దర్శకుడు శీను రామస్వామి (Seenu Ramaswamy), విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో చిత్రం ఇది. గతంలో ‘తెన్‌మేర్కు పరువకాట్రు’, ‘ఇడమ్‌ పొరుల్‌ ఎవల్‌’, ‘ధర్మదురై’ వంటి చిత్రాలు వచ్చాయి. నాలుగో చిత్రంగా తెరకెక్కిన ‘మామనిదన్‌’కు విడుదల తేదీ ఏమాత్రం అచ్చిరావడం లేదు. ఫలితంగా నాలుగోసారి విడుదల తేదీ మార్చారు. 


అంతకుముందు ఈ నెల 20వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, ఆ రోజు ఉదయనిధి నటించిన ‘నెంజుక్కు నీతి’ (nenjukku neethi) చిత్రం విడుదలైంది. దీంతో ‘మామనిదన్‌’ (Maamanithan) కు తగినన్ని థియేటర్లు లేక జూన్‌ 23కి వాయిదా వేశారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్న స్టూడియో9 ట్వీట్‌లో వెల్లడించింది. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కనీసం 400 థియేటర్లు కావాలన్న ఆలోచనతో మరోమారు వాయిదావేసినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైఎస్ఆర్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఇయళరాజా (Ilayaraja), ఆయన తనయుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankarraja) కలిసి తొలిసారి సంగీతం సమకూర్చారు. నిర్మాత ఆర్‌.కె.సురేష్‌ (Rk suresh) కు చెందిన స్టూడియో 9 (Studio 9) ఈ సినిమాను రిలీజ్‌ చేయనుంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ సేతుపతి హీరోగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International