Vijaykanth త్వరగా కోలుకోవాలి

ABN , First Publish Date - 2022-06-22T15:00:25+05:30 IST

తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

Vijaykanth త్వరగా కోలుకోవాలి

                                  - స్టాలిన్‌, రజనీ ఆకాంక్ష


చెన్నై, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వారిద్దరూ వేర్వేరుగా సామాజిక మాధ్యమాల్లో తమ శుభాకాంక్షలు తెలిపారు. మధుమేహం పెరగడంతో కుడికాలి వేలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో వైద్యులు సోమవారం దానిని తొలగించారు. దీంతో విజయకాంత్‌ ఆరోగ్యం పట్ల రకరకాల పుకార్లు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని, తిరిగి రావాలంటూ స్టాలిన్‌, రజనీకాంత్‌ ఆకాంక్షించారు.

Updated Date - 2022-06-22T15:00:25+05:30 IST