మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి వెళుతున్న విజయేంద్ర సరస్వతి
తిరుమల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటే శ్వరస్వామిని బుధవా రం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి విజయేం ద్ర సరస్వతి దర్శించుకున్నారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్దనున్న రావిచెట్టు వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత మంగళవాయిద్యాల నడుమ మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకున్నారు.