Breaking: రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

ABN , First Publish Date - 2022-07-07T02:07:26+05:30 IST

సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్‌, లెజండరీ అథ్లెట్ పీటీ ఉష కూడా..

Breaking: రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

న్యూఢిల్లీ: సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్‌, లెజండరీ అథ్లెట్ పీటీ ఉష కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాధికారం ప్రకారం.. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను.. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే అధికారం ఉంది. ఆ కోటాలోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది.



ఇళయరాజా ఇటీవల 'అంబేద్కర్‌ - మోదీ' పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అదృష్టం దక్కడం గమనార్హం. కర్ణాటకకు చెందిన వితరణ శీలి, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్దేను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు.







Updated Date - 2022-07-07T02:07:26+05:30 IST