Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 16 Jan 2022 15:26:53 IST

హాలీడే వేళ జిమ్‌లో ‘లైగర్’

twitter-iconwatsapp-iconfb-icon
హాలీడే వేళ జిమ్‌లో లైగర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. విజయ్ బాక్సర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. థర్డ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పా్న్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రకోసం విజయ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్నాడు. జులపాల జుట్టు, కండలు తిరిగిన శరీరంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.


తాను ‘లైగర్’ కోసం ఎంత కష్టపడుతున్నాడో విజయ్ తాజాగా  ఒక ఫోటో ద్వారా ట్విట్టర్ లో రివీల్ చేశాడు. ‘నగరం మొత్తం హాలీడే లో ఉంది. జిమ్ మాత్రం ఖాళీగా ఉంది. అయితే ఒక్కరు మాత్రం వర్కవుట్స్ కోసం కష్టపడుతున్నాడు. అంటూ విజయ్ దేవరకొండ జిమ్ లో తాను కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినిమాకోసం ఇంతగా కష్టపడుతున్న విజయ్ దేవరకొండ డెడికేషన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 25న లైగర్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement