విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ పాక్షిక రద్దు

ABN , First Publish Date - 2021-01-19T07:08:51+05:30 IST

గుంతకల్లుమీదుగా వెళ్లే విజయవాడ-హుబ్లీ-విజయవాడ ఎక్స్‌ప్రె్‌సను పాక్షికంగా రద్దు పరచినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ పాక్షిక రద్దు



గుంతకల్లు, జనవరి18: గుంతకల్లుమీదుగా వెళ్లే విజయవాడ-హుబ్లీ-విజయవాడ ఎక్స్‌ప్రె్‌సను పాక్షికంగా రద్దు పరచినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. హుబ్లీలో యార్డు పనులు చేపడుతున్న కారణంగా ఈ రైళ్లను విజయవాడ నుంచి గుంతకల్లు వరకు మాత్రమే నడపనున్నట్లు తెలియజేశారు. గుంతకల్లు-హుబ్లీ సెక్షన్‌లో ఈ రైళ్లను రద్దుపరచామన్నారు. విజయవాడ-హుబ్లీ (నెం. 07225) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 20 నుంచి 29వ తేదీ వరకూ, హుబ్లీ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (నెం.07226) రైలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకూ విజయవాడ-గుంతకల్లు మధ్య మాత్రమే నడుస్తాయన్నారు.

Updated Date - 2021-01-19T07:08:51+05:30 IST