విజయవాడ: బెజవాడలో టీడీపీ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కేశినేని నిర్ణయంతో రాజకీయం రాజుకుంది. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు కేశినేని భవన్కు చేరుకుంటున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలు సహా ఇతర నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని భవన్కు చేరుకుంటున్నారు. 2024లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై కార్యకర్తలు ఒత్తిడి పెడుతున్నారు. కాగా బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు.