Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ నడిబొడ్డున ‘బూతుల మంత్రి’కి చంద్రబాబు కౌంటర్

విజయవాడ: రాష్ట్ర మంత్రి కొడాలిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన రోడ్‌ షోలో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?’’ అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వాపోయారు. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే... టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని తెలిపారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్నాడు... ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..?’’ అని ప్రశ్నించారు. తమ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చామని, ఇప్పుడు దాన్ని తీసేశారన్నారు. పెళ్లి కానుక రావడం లేదని, భరోసాను పెంచామని చెప్పుకొచ్చారు. 

Advertisement
Advertisement