Prakasam Barrage: ఉధృతంగా వరద నీరు.. తాజా పరిస్థితి ఎలా ఉందంటే..!

ABN , First Publish Date - 2022-07-25T00:00:15+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద నీరు ఉధృతి అధికమైంది. గరిష్ట నీటిమట్టం 12 అడుగులు దాటి ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో...

Prakasam Barrage: ఉధృతంగా వరద నీరు.. తాజా పరిస్థితి ఎలా ఉందంటే..!

విజయవాడ (Vijayawada): ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద నీరు ఉధృతి అధికమైంది. గరిష్ట నీటిమట్టం 12 అడుగులు దాటి ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు (Irrigation Officers), జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. నిన్నటి నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు విడత వారీగా కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 50 గేట్లు అడుగు మేర, మరో 20 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 


మరోవైపు డెల్టా కాలువకు దాదాపు 5800 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెట్టారు. ఇప్పటికే మున్నేరు (Munneru) వద్ద భారీగా వరద నీరు ఉప్పొంగింది. దీంతో ప్రధాన రహదారిపై నీరు (Water) ప్రవహిస్తోంది. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ దిగువన చాలా మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వీరందరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారానికి లక్ష క్యూసెక్కుల నీరు కిందకు విడుదల  చేసే అవకాశం ఉంది. మరో రెండు రోజుల పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్‎కు అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 70 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.  




Updated Date - 2022-07-25T00:00:15+05:30 IST