జగన్ అంటే నమ్మకానికి ఒక బ్రాండ్ అనుకున్నాం.. కానీ...

ABN , First Publish Date - 2022-02-03T18:08:05+05:30 IST

సీఎం జగన్ అంటే నమ్మకానికి ఒక బ్రాండ్ అనుకున్నామని.. కానీ మమ్మల్ని నమ్మించి మోసం చేశారని..

జగన్ అంటే నమ్మకానికి ఒక బ్రాండ్ అనుకున్నాం.. కానీ...

విజయవాడ: సీఎం జగన్ అంటే నమ్మకానికి ఒక బ్రాండ్ అనుకున్నామని.. కానీ మమ్మల్ని నమ్మించి మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ పీఆర్సీ అన్నప్పుడు పూర్తిగా దాని ప్రకారం ఇవ్వాలని, లేదా అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ప్రకారమైనా ఇవ్వాలని, అలా కాకుంటే ఐఏఎస్ కమిటీ రిపోర్టునైనా ఫాలో కావాలని అన్నారు.


కాగా ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఉపాధ్యాయులు, ఉద్యోగులు మొత్తం విజయవాడకు చేరుకున్నారు. ఆందోళన కారులకు దారిపొడవున ప్రజలు మంచినీరు, నిమ్మరసం అందిస్తున్నారు. ప్రజల నుంచి కూడా తమ ఆందోళనకు మద్దతు లభిస్తుందని ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె ఉధృతం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.


ఛలో విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు.. (Live Updates)

Updated Date - 2022-02-03T18:08:05+05:30 IST