విజయవాడ హత్య కేసులో కీలక సాక్ష్యాధారాలు గుర్తింపు

ABN , First Publish Date - 2020-10-11T17:57:43+05:30 IST

విజయవాడ : జిల్లాలో కలకలం రేపిన మహేష్ హత్య కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను గుర్తించారు.!

విజయవాడ హత్య కేసులో కీలక సాక్ష్యాధారాలు గుర్తింపు

విజయవాడ : జిల్లాలో కలకలం రేపిన మహేష్ హత్య కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను గుర్తించారు.! ఈ కేసుకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారనేదానిపై పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. ఘటనాస్థలంలో 6 ఎం.ఎం బులెట్లు ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. 2014 తర్వాత తుపాకీతో కాల్పులు అనేవి విజయవాడలో జరగలేదు. ఆ తర్వాత జరిగిన ఘటన ఇదే కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే అసలు ఆ తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎవరు ద్వారా తెచ్చారు..? అన్న కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యవహరమా..? లేకుంటే అక్రమ సంబంధమా..? మరే ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా.. మహేష్‌ను అతి దగ్గర్నుంచే కాల్పులు జరిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుకు గాను 10 ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు విజయవాడ బైపాస్‌ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌‌ను కూడా బెజవాడ పోలీసులు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2020-10-11T17:57:43+05:30 IST