ఛలో విజయవాడ కార్యక్రమం.. ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్...

ABN , First Publish Date - 2022-02-03T15:51:42+05:30 IST

శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉద్యోగులు శారద కళాశాల సమీపంలో బీఆర్టీఎస్‌కు చేరుకున్నారు.

ఛలో విజయవాడ కార్యక్రమం.. ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్...

విజయవాడ: పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉద్యోగులు శారద కళాశాల సమీపంలో బీఆర్టీఎస్‌కు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు చిక్కకుండా శారదా కాలేజీ సమీపంలోని శివరామయ్య క్షేత్రానికి చేరుకున్నారు. తాము బీఆర్టీఎస్‌కు చేరుకున్నామని తమను ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చీకటి జీవోలను రద్దు చేసి నివేదిక  ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవంటూ విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.


రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఉద్యోగులను ఎక్కడికక్కడ అడుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. విజయవాడకు వస్తున్న ప్రతి బస్సుని, కార్లు, బైక్‌లను ఆపి చెక్ చేస్తున్నారు. ఉద్యోగుల వాట్సాప్ చెక్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఆరెస్ట్ చేసిన వారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Updated Date - 2022-02-03T15:51:42+05:30 IST