కార్తీక మాసం ఆఖరి రోజు.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-12-05T15:31:48+05:30 IST

కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు ...

కార్తీక మాసం ఆఖరి రోజు.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

విజయవాడ: కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతూ పోలి స్వర్గానికి పంపిస్తున్నారు. మహిళలు అరటి డోప్పల్లో 31 వత్తులు వెలిగించి ఓం నమ:శివాయ అంటూ కార్తీక దీపాలను వదులుతున్నారు. అలాగే శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 


కాగా నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో స్నాన ఘట్టాలు రద్దీగా మారాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేసి గోదావరిలో పోలి స్వర్గం వద్ద దీపాలను వదులుతున్నారు.

Updated Date - 2021-12-05T15:31:48+05:30 IST