Abn logo
Oct 14 2021 @ 12:37PM

దుర్గమ్మ నదీ విహారంపై నెలకొన్న సందిగ్ధత

విజయవాడ: దసరా ఉత్సవాల ఆఖరి రోజు శుక్రవారం కృష్ణానదిలో కనక దుర్గమ్మ నదీ విహారంపై సందిగ్ధత నెలకొంది. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రేపు తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద లక్ష క్యూసెక్కులకు పైగా ఔట్ ఫ్లో కొనసాగుతోంది. కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి  అనుమతులిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.