‘ఒక్క ఛాన్స్ అంటే ఓట్లేశాం.. ఇప్పుడు Jagan మా నోట్లో మట్టి కొట్టారు’

ABN , First Publish Date - 2022-06-01T16:41:33+05:30 IST

ఒక్క ఛాన్స్ అంటే ఓట్లేశామని.. ఇప్పుడు సీఎం జగన్ తమ నోట్లో మట్టి కొట్టారని ప్రజలు మండిపడుతున్నారు.

‘ఒక్క ఛాన్స్ అంటే ఓట్లేశాం.. ఇప్పుడు Jagan మా నోట్లో మట్టి కొట్టారు’

Vijayawada: ఇంటింటికి కార్యక్రమం సీపీఎం (CPM) నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ, కృష్ణలంక వాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటే ఓట్లేశామని.. ఇప్పుడు సీఎం జగన్ (Jagan) తమ నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి... రెండు, మూడు రెట్లు తిరిగి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేక పస్తులుంటున్నామని, తమ వాళ్లు ఉపాధి కోల్పోయి ఊళ్లు వెళ్లి పోయారన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచేశారని, ఏడాది మొత్తం పన్ను ముందుగానే ఒకేసారి కట్టాలంటే ఎలా అని ప్రశ్నించారు. పన్నులు కట్టలేమంటే వాలంటీర్లతో బెదిరిస్తున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పూర్తిగా రద్దు చేస్తామంటున్నారని తెలిపారు. విద్యుత్ చార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచారని, రూ. 5 వందలు వచ్చే బిల్లు రూ. 1300 చేశారన్నారు. తెల్ల రేషన్ కార్డులు తొలగించి... ప్రభుత్వ పథకాలకు అనర్హులమని చెబుతున్నారని, అధికారుల‌ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-01T16:41:33+05:30 IST