నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖపై మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2021-02-24T19:06:26+05:30 IST

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖపై మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష

విజయవాడ: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీఎసీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరుగుతోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితిపై మంత్రి గౌతమ్‌ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనణల ప్రకారం నైపుణ్య శాఖ లక్ష్యం, ఉద్దేశాలను అధికారులకు మంత్రి వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీలలో కోర్సులు సహా శిక్షణ తదితర అంశాలను ముఖ్య కార్యదర్శి జయలక్షి...మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, సీడాప్ సీఈవో ఎం. మహేశ్వర్ రెడ్డి, ఎపిఎస్ఎస్డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హనుమనాయక్, డాక్టర్ డి.వి రామకోటిరెడ్డి, తదితరులు సమీక్షకు హాజరయ్యారు. 

Updated Date - 2021-02-24T19:06:26+05:30 IST