విజయవాడ నగర మేయర్‌ భాగ్యలక్ష్మి!

ABN , First Publish Date - 2021-03-17T21:08:07+05:30 IST

విజయవాడ నగర వైసీపీ మేయర్‌ అభ్యర్ధిగా భాగ్యలక్ష్మి పేరును దాదాపుగా ఖరారు చేశారు. బీసీ వర్గాలకు మేయర్‌ పదవి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.

విజయవాడ నగర మేయర్‌ భాగ్యలక్ష్మి!

విజయవాడ: విజయవాడ నగర వైసీపీ మేయర్‌ అభ్యర్ధిగా భాగ్యలక్ష్మి పేరును దాదాపుగా ఖరారు చేశారు. బీసీ వర్గాలకు మేయర్‌ పదవి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. మరికొద్దిసేపట్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేయనుంది. విజయవాడ మేయర్‌ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించారు. మొదటి మేయర్ రేసులో 34వ డివిజన్‌ నుంచి గెలుపొందిన బండి పుణ్యశీల, 42 నుంచి గెలుపొందిన పగిడిపాటి చైతన్యరెడ్డి, మూడో డివిజన్‌ నుంచి గెలుపొందిన భీమిశెట్టి ప్రవల్లిక పేర్లు వినిపించాయి.


ఎస్సీ మహిళ కోటాతోపాటు పార్టీకి విధేయురాలిగా ఉంటూ వస్తున్న తనకు మేయర్‌ బాధ్యతలు అప్పగించాలని పుణ్యశీల పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. అయితే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అండతో చైతన్యరెడ్డి ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ప్రవల్లికకు మేయర్‌ సీటు ఇవ్వాలని దేవినేని అవినాశ్‌ వర్గం ప్రతిపాదించింది. వీరందరిని కాదని భాగ్యలక్ష్మిని మేయర్ చేయాలని అధికార పార్టీ భావించింది. విజయవాడ కార్పొరేషన్‌లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో వైసీపీ 49 స్థానాలను దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థులు 14 స్థానాల్లో గెలిచారు. ఇక సీపీఎం 1 స్థానంతో సరిపెట్టుకుంది. 

Updated Date - 2021-03-17T21:08:07+05:30 IST