విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు అమ్మవారికి శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి సారెను సమర్పించారు. గురువారం ఉదయం సుమారు రెండు వందల మంది భక్తులతో కలిసి శివస్వామి అమ్మవారికి సారెను సమర్పించారు. సారెను సమర్పించిన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆపై శివస్వామికి అమ్మవారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
ఇవి కూడా చదవండి