Vijayawada: జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-04-27T17:52:43+05:30 IST

నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Vijayawada: జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిం సమస్యలపై వన్ టౌన్ నెహ్రూ సెంటర్‌లో ధర్నాకు జనసేన నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు. కాగా పోతిన మహేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ జనసేన సైనికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం సమస్యలపై ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లింల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ముస్లింల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ముస్లింలకు ఏమి లబ్ది చేకూర్చారంటూ జగన్‌ను జనసేన నేత సూటిగా ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధికి పాటుపడని ముఖ్యమంత్రి జగన్‌కు విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చే హక్కు లేదన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి బినామీల చేతుల్లో ఉన్న వక్ఫ్‌బోర్డ్ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రక్షించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-04-27T17:52:43+05:30 IST