Vijayawada: జీతాలు చెల్లించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-05-12T19:51:22+05:30 IST

జీతాలు చెల్లించాలని విద్యుత్ శాఖ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏప్రిల్ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు.. ఈ నెల 12వ తేదీ వచ్చిన ఇంకా పడలేదు.

Vijayawada: జీతాలు చెల్లించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నా

విజయవాడ: జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏప్రిల్ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇంకా పడలేదు. జీతాల మీద ఆధారపడి విద్యుత్ శాఖ ఉద్యోగులు లోన్లు తీసుకున్నారు. జీతాలు సక్రమంగా పడకపోవడం వల్ల తమకు చెక్ బౌన్స్ అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు లేటుగా పడడం వల్ల ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్ డబ్బులు పడని పరిస్థితి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించాలి లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

Read more