విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను శ్రీ శ్రీ శ్రీ విజయానంద దత్త స్వామి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయానందదత్త స్వామిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం స్వామీజీకి అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు.