ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం

ABN , First Publish Date - 2021-10-11T19:48:09+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రెండు అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  ఈరోజు రెండు అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం  అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు....మధ్యాహ్నం శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు  పురాణాలు  చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీ అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. 

Updated Date - 2021-10-11T19:48:09+05:30 IST