Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ విషయం గుర్తు చేసుకుని విజయవాడ సీపీ భావోద్వేగం

విజయవాడ : ఫేక్ ఎఫ్‌డీలు హైదరాబాద్‌లో ప్రారంభమై విజయవాడకు చేరాయని సీపీ బి.శ్రీనివాసులు తెలిపారు. తాను ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నానని శ్రీనివాసులు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ కాలం చాలా దుర్భరంగా గడిచిందన్నారు. మహబూబ్ నగర్‌లో ఓఎస్డీగా పని చేస్తున్నపుడు ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్ళు ల్యాండ్ మైన్ పేలి చనిపోయారన్నారు. ఆ ఘటన తనకు అత్యంత బాధ కలిగించిందని చెబుతూ.. సీపీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 


ఫేక్ ఎఫ్‌డీల విషయమై ఆత్కూర్, భవానీపురంలలో కేసులు నమోదయ్యాయన్నారు. కొత్త వ్యక్తులు చాలా మంది బయటపడ్డారని.. వారిలో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. హైదరాబాద్ నుంచి 8 మందిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చామన్నారు. దాదాపు 2 కోట్లు సొమ్ము రికవరీ చేశామని సీపీ తెలిపారు. 2.57 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేసి, కోర్టుకు అందజేశామన్నారు. 11.4 కోట్లు కొత్త మోసం చేసేందుకు ఫేక్ ఎఫ్‌డీలు తయారు చేశారన్నారు. వరుస పరిశోధనల నేపథ్యంలో 11.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము మోసం జరగకుండా ఆపామన్నారు. ఇంకా 8 కోట్ల సొమ్ము రికవరీ కావల్సి ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. బ్యాంకులలో సిబ్బంది, మేనేజర్లు, బ్రోకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మరోవైపు లోన్‌ల ముసుగులో డిపాజిట్ల దందా జరుగుతోందన్నారు. వచ్చిన సొమ్ములను హవాలా కోసం కూడా ఎఫ్‌డీ నేరస్తులు వినియోగించారని సమాచారం.

Advertisement
Advertisement