విజయవాడ: జిల్లాలోని గొల్లపూడిలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. 60 సంవత్సరాల వృద్దుడిని దుండగులు హత్య చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం జరిగింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.